ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల లోని థియేటర్లో సర్కారు వారి పాట మేనియా కొనసాగుతోంది. పరశురామ్ దర్శకత్వం లో సూపర్ స్టార్  మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అదే సమయం లో భారీ వసూళ్లు దిశగా దూసుకు పోతోంది. అయితే కేవలం రెండు రోజుల వ్యవధి లోనే 100 కోట్ల మార్కును అందుకుంది సర్కారు వారి పాట సినిమా.


 ఇక ఇటీవలే వీకెండ్ కావడం తో అటు ప్రేక్షకులు అందరూ కూడా సినిమా చూసేందుకు థియేటర్లకు తరలి వెళ్లారు అని చెప్పాలి. ఇకపోతే అటు సినిమా సూపర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అతి చిత్రబృందం మాత్రం ప్రమోషన్స్ లో బిజీగానే ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా లో కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది కీర్తి సురేష్. తన నటనతో తన అందం అభినయంతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే  ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానుల తో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ సర్కారు వారి పాట సినిమాలో తనకు ఫేవరెట్ సాంగ్ ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది.


 ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఈ ముద్దుగుమ్మ మీ ఫేవరెట్ సాంగ్ ఏది అని అడగగా మ మ మహేష్ అనే సాంగ్ అంటూ చెప్పేసింది.  అయితే ఇప్పటి వరకు డాన్సు ఎక్కువగా ఉన్న పాత్రలో నటించని కీర్తి సురేష్ ఇటీవల సర్కారు వారి పాట సినిమాలో మాత్రం మ మ మహేష్ అనే సినిమాలో తనలో ఉన్న డాన్సింగ్ స్కిల్స్ కూడా బయట పెట్టింది. దీంతో ఇక కీర్తి సురేష్ డాన్స్ అదరగొట్టింది అంటూ ఎంతో మంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: