మహేష్ బాబు తాజాగా విడుదలైన సర్కార్ వారి పాట సినిమా విడుదలై మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. ఇక తన అభిమానులు కోరుకునే విజయాన్ని కూడా చేకూర్చాడు మహేష్ బాబు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఘన విజయాన్ని అందుకున్నాడు మహేష్ బాబు. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే వసూళ్ళ పరంగా మాత్రం ఈ సినిమా పలు రికార్డులను కూడా సొంతం చేసుకుంటుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్లుగా తెలుస్తోంది.


ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు మహేష్ బాబు SSMB 28 గా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక మహేష్ తో పాటు ఈ చిత్రంలో మరొక హీరో నటించే అవకాశం ఉంది అన్నట్లు గా సమాచారం అందుతోంది.

 గెస్ట్ పాత్రలో హీరో నాని ఈ చిత్రం లో కనిపించబోతున్నారనే వార్త వినిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ తో తెరకెక్కించిన అలా వైకుంఠపురం చిత్రంలో అక్కినేని హీరోగా సుమంత్ కీలక పాత్రలో నటించెలా చేశారు. అయితే SSMB-28   సినిమాలో ముగ్గురు హీరోలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి హీరో నాని సంప్రదించటం జరుగుతుంది. గతంలో కూడా నాగార్జునతో కలిసి నాని నటించిన దేవదాస్ సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది. అయితే హీరో నాని కూడా గతంలో ఏ హీరోతో అయినా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేసినట్లు గా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: