ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం కే జి ఎఫ్. గతంలో కన్నడ ఇండస్ట్రీని చాలా చిన్న చూపు చూసేవారు కానీ కే జి ఎఫ్ సినిమా ఎప్పుడైతే విడుదలైంది అప్పటినుంచి ఇండస్ట్రీ లెక్కల ని తారుమారయ్యాయి అని చెప్పవచ్చు. ఇక సౌత్ నార్త్ మొత్తాన్ని షేక్ చేస్తోంది ఈ చిత్రం. కేవలం శాండిల్ వుడ్ లోనే స్టార్ హీరో గా ఉన్న యశ్. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇలాంటి చిత్రంలో హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టి తన తొలి చిత్రంతోనే పలు భాషలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

కే జి ఎఫ్ రెండు పార్ట్లలో నటించింది శ్రీనిధి శెట్టి. అతి తక్కువ సన్నివేశాలలో నటించినప్పటికీ ఈమెకు అనుకున్నంత స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో ఆమె అన్ని వైపుల నుంచి వరుస ఆఫర్లు వెళ్ళి పడుతున్నాయి. కానీ ఈమె ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇకపోతే తాజాగా శ్రీనిధి శెట్టి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది అక్కడ కొన్ని ప్రశ్నలకు ఆమె పలు ఆసక్తికరమైన సమాధానాలు తెలియజేసింది.

అభిమానించే నటులలో యశ్, విక్రమ్ బాలీవుడ్ నటి మధుబాల అని తెలియజేసింది. ఇక ఈమె కు ఎలాంటి పాత్రలో నటించాలని ఉందట. తన మొదటి లవ్ తన అమ్మనని తెలియజేసింది. ఎదుట వ్యక్తి లో తను గమనించేది మొదట వారి యొక్క కళ్ళ నే అని తెలియజేసింది. వాటి ఆధారంగానే వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటామని శ్రీనిధి తెలిపింది. ఈ క్రమంలో యాంకర్ పేరు ప్రఖ్యాతలు కావాల డబ్బు కావాలా అని ప్రశ్నించగా.. అందుకు శ్రీనిధి మొహమాటం లేకుండా కేవలం తనకు డబ్బే కావాలని ఆన్సర్ చెప్పడం తో యాంకర్ షాక్ అయింది. దీంతో పలువురు నెటిజన్స్ ఆమె పై సెటైర్లు కూడా వేయడం జరుగుతోంది. కొంతమంది శ్రీనిధి కి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. మనం ఏది కొనాలనుకున్న డబ్బు కావాల్సింది కాబట్టి ఈమె అదే ఎంచుకొంది అని నెటిజన్లు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KGF