లేటెస్ట్ గా విడుదలైన రాజశేఖర్ ‘శేఖర్’ ఫెయిల్ అవ్వడంతో మళ్ళీ ధియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాలి అంటే ‘ఎఫ్ 3’ విడుదల అయ్యేంతవరకు ఆగవలసిన పరిస్థితి. ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ కు ఈమూవీ పై భారీ అంచనాలు ఉండటంతో ఈమూవీ పై భారీ బడ్జెట్ ఖర్చుపెట్టారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈమూవీకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడానికి దిల్ రాజ్ ప్రమోషన్ పరంగా ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అనుసరిస్తున్నాడు.


ఈ నేపధ్యంలో ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజ్ ఈమూవీ పై చేసిన కామెంట్స్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈమూవీ చూసే ప్రక్షకులు ఈమూవీ కథ విషయంలో లాజిక్ లు ఆలోచించవద్దని కేవలం 5నిముషాలకు ఒకసారి ప్రేక్షకులను నవ్వించడానికి ఈమూవీలో కామెడీ సన్నివేశాలు వస్తూ ఉంటాయని లీకులు ఇచ్చాడు. దీనితో ఈమూవీలో కథ ఉండడు అన్న క్లారిటీ దిల్ రాజ్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది.


ప్రస్తుత తరం ప్రేక్షకులు సినిమా ఎంత బాగున్నప్పటికీ మూల కథ సరిగ్గా లేకపోతే పెదవి విరుస్తున్నారు. టివి షోలలో కామెడీ షోలను తెగ చూస్తున్న సగటు ప్రేక్షకుడు మళ్ళీ అదే పద్ధతిలో లాజిక్ లేని హాస్యాన్ని సినిమాలలో కోరుకోవడం లేదు. కేవలం కథతో మిళితమైన హాస్యాన్ని మాత్రమే ప్రేక్షకుడు ఆదరిస్తున్నారు. దీనితో లాజిక్ లేని సన్నివేశాలు ఎక్కువగా ఉండే ‘ఎఫ్ 3’ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు రావడం సహజం.


అయితే ఎటువంటి లాజిక్స్ లేకుండా వచ్చిన ‘జాతిరత్నాలు’ ‘డిజే టిల్లు’ లాంటి చిన్న సినిమాలు విపరీతంగా యూత్ చూశారు. అయితే పెద్ద హీరోల సినిమాలు వచ్చేసరికి ప్రేక్షకుడు ఎంతోకొంత కథను కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో లాజిక్ లేని సన్నివేశాలు ఎక్కువగా ఉండే ‘ఎఫ్ 3’ ని సగటు ప్రేక్షకుడు తన మైండ్ ను తన ఇంటిలో పెట్టుకుని కేవలం నవ్వడానికి మాత్రమే ‘ఎఫ్ 3’ ని ‘ఎఫ్ 2’ లా రిపీటేడ్ గా చూస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: