సాధారణంగా సమాజంలో గౌరవ , మర్యాదలు పొందాలి అంటే కచ్చితంగా డబ్బు ఉండాలి.. డబ్బు లేనిదే ఏ పని చేయలేము. అలాగే గౌరవం కూడా ఇవ్వరు.  ఇక సరిగ్గా ఇలాంటి మాటలనే ప్రముఖ సీనియర్ హీరోయిన్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించడం..ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఆ హీరోయిన్ ఎందుకు అలా అనాల్సి వచ్చింది..? ఆమె ఎవరు.?  అనే విషయం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.. ఆమె ఎవరో కాదు ముచ్చర్ల అరుణ.. ముచ్చర్ల అరుణ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసింది. అంతేకాదు హీరోయిన్ గా ఈమె  నటించిన సీతాకోకచిలుక సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక అని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఆమె ఏ పాత్ర పోషించినా సరే ఆ పాత్రకే అందం వచ్చేలా నటించడం ఆమె ప్రత్యేకత. మంచి గుర్తింపు తెచ్చుకున్న ముచ్చెర్ల అరుణ వివాహమైన తర్వాత నటనకు పూర్తిగా దూరం అయింది. నలుగురు కూతుళ్లు.. భర్త ఒక పెద్ద బిజినెస్ మేన్.. అరుణ ఎంతో శ్రీమంతురాలు అని చెప్పవచ్చు. ఇంటర్వ్యూలో పాల్గొన్న అరుణ.. ఎవరేమనుకుంటారో.. అని ఆలోచిస్తూ అవతల వాళ్ళ కోసం బ్రతికేస్తూ ఉంటారు కానీ ఆ విషయం నాకు అస్సలు నచ్చదు.  మా ఇంట్లో మొత్తం ఆరు కార్లు వుంటాయి. ప్రతి కార్ కి  ఒక డ్రైవర్ ఉన్నారు. ఇక నాకు మాత్రం డ్రైవర్ వద్దనే చెబుతాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అని తెలిపింది ముచ్చర్ల అరుణ. వెళ్లే కారు కంఫర్ట్గా ఉంటే చాలు అని అది ఎలాంటిదైనా సరే పర్వాలేదు అని ఆమె తెలిపింది.

ముఖ్యంగా నా రేంజ్ ఇది అని చూపించుకోవడానికి ఉపయోగించే కార్లు నాకు అవసరం లేదు అని..అలా తనకుఅస్సలు ఇష్టం ఉండదు అని సౌకర్యంగా ఉంటే చాలు అని ఆమె తెలిపింది. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది డబ్బున్న వాళ్లకి ఎక్కువ గౌరవమర్యాదలు ఇస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్  కాదు అంటూ తనదైన శైలిలో తెలిపింది అరుణ.

మరింత సమాచారం తెలుసుకోండి: