భారత సినీ ఇండస్ట్రీలో దేశం గర్వించదగ్గ నటుడు గా లోక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విశ్వనటుడు కమల్ హాసన్. తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాకుండా అభిమానులకు సడన్ సర్ప్రైస్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారిని అనుకోకుండా కలుసుకుని.. కరచాలనం చేసి.. హగ్ కూడా చేసుకోవడం జరిగింది. సాధారణంగా ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన హీరో ని చూడాలి అని.. కలవాలి అని .. వారితో మాట్లాడాలి అని ఇలా రకరకాలుగా ఎంతోమంది అభిమానులు కలలుకంటూ ఉంటారు.. కుదరకపోతే కనీసం దూరం నుంచి చూస్తే చాలు అని  అనుకునే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ఒకవేళ తమ అభిమాన హీరోలు..వారే తమ వద్దకు స్వయంగా వచ్చి సడన్ గా సర్ప్రైజ్ ఇస్తే.. అది కూడా హగ్ చేసుకోని.. కరచాలనం చేసి అభినందనలు తెలిపితే.. ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధులు ఉంటాయా..? వారి కాళ్ళు భూమి మీద నిలబడగలవా..? ఇక అలా లోకనాయకుడు కమల్ హాసన్ ఉన్నట్టుండి తన అభిమానులకు కనిపించి వారిని ఆశ్చర్యంతో పాటు భావోద్వేగానికి కూడా గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది.

ఇకపోతే కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం విక్రమ్ హిట్ లిస్ట్.. ఇక ఈ సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ కనగరాజు దర్శకత్వంలో రూపొందుతోంది . ఇక ఇందులో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి , ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రేజీ హీరో సూర్య కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ రాగా.. ఈ మూవీ ట్రైలర్ ని తెలుగులో రామ్ చరణ్ కూడా విడుదల చేశారు . ఇక జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా షురూ చేశారు చిత్రయూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: