సినీ పరిశ్రమలో బయోపిక్ లు రావడం అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుండో వస్తున్నదే కానీ ఈ మధ్యకాలంలో ఈ తరహా చిత్రాల జోరు పెరిగిందనే చెప్పాలి. అందులోనూ రాజకీయ వేత్తలు , క్రికెటర్ ల బయోపిక్ లకు బాగా ఎక్కువగా ఆదరణ పెరుగుతోంది. క్రికెట్ ఫీవర్ తో ఎపుడు ఊగిసలాడే అభిమానులు తమ అభిమాన లెజెండరీ క్రికెటర్ల నిజ జీవితాలను తెరపైకి తీసుకు రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఇపుడు వినిపిస్తున్న వార్త వారికి గొప్ప శుభవార్తే అని చెప్పాలి. అసలు వివరాలు ఇలా ఉన్నాయి.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కి ముహూర్తం ఖరారు కానుంది అని గత కొన్నాళ్లుగా చాలా వార్తలే వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇపుడు అది ఆచరణలోకి వచ్చే సమయం వచ్చేసింది అని తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఆ లెజెండరీ క్రికెటర్ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె క్రికెటర్ గంగూలీ బయోపిక్ ను రూపుదిద్దాలి అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ సారథి, కోల్కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ జీవిత కథను కూడా వెండితెరపై చూపించడానికి ఇప్పటికే ఈమె సన్నాహాలు మొదలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు  ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైపోయాయి అని వార్తలు  వెల్లువెత్తుతున్నాయి.  

క్రికెటర్ గా రిటైర్డ్ అయినప్పటికీ ఐపీఎల్-15 తో పాటు బీసీసీఐ పనులతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న దాదా.. తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలు, ఆసక్తికర సంఘటనల గురించి రచయితలతో చెప్పేందుకు షెడ్యూల్ చేసుకున్నారని..ఇప్పటికే రెండు మూడు సిట్టింగ్స్ కూడా అయ్యాయి అని సమాచారం.  తాజాగా కోల్కతా వెళ్ళిన సూపర్ స్టార్ తనయ ఐశ్వర్య ...ఇదే పనిపై గంగూలీని కలవడానికి వెళ్లారని టాక్.   కోల్కతాలో ఈడెన్ గార్డెన్ లో ప్రస్తుతం ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్ లో బిజీగా ఉన్నా దాదాతో ఐశ్వర్యతో మంగళవారం రాత్రి డిన్నర్ కూడా చేసినట్టు సమాచారం. ఆ టైం లో వీరి మద్య బయోపిక్ గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.  అయితే ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: