హీరో రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ తో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా జూన్ 17 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గా చిత్రబంధ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.


అయితే ఇప్పుడు తాజాగా మాస్ మహారాజా అభిమానులకు షాక్ ఇచ్చారని మేకర్స్ తెలుస్తోంది రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల వాయిదా పడుతూ ఉన్నట్లు గా ప్రకటించడం జరిగింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల వాయిదా పడింది బెస్ట్, మాసిమోస్ట్ అవుట్పుట్ సిద్ధం చేయడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో చాలా ఆలస్యం కారణంగా ఈ సినిమా జూన్ 17న విడుదల చేయడం కష్టమని చిత్రబృందం తెలియజేశారు.

త్వరలోనే కొత్త  విడుదల తేదీని ప్రకటిస్తామని. చిత్రబృందం అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంకా కౌశిక్.. రజిషా విజయం హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో అలనాటి హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక అంతేకాకుండా నాజర్, నరేష్, పవిత్ర లోకేష్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రవితేజ ఈ చిత్రంతో పాటు ధమాకా అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తో రవితేజ అభిమానులు కాస్త నిరా శ చెందారని చెప్పవచ్చు. ఇక గతంలో విడుదలైన ఖిలాడి చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: