అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఈ మూడు సినిమాల్లో మెజారిటీ ప్రేక్షకాభిమానుల దృష్టి, ఆసక్తి సలార్ మూవీ మీదనే ఉంది. తొలిసారిగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తీస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన సలార్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో ఉంటుందని, పక్కాగా మాస్ తో యువతని ఈ పాత్ర మరింత విశేషంగా ఆకట్టుకుంటుందని ఇన్నర్ వర్గాల టాక్.
ఇక స్క్రిప్ట్ కూడా ఎంతో అద్భుతంగా రాసుకున్న ప్రశాంత్ నీల్ దీనిని భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీస్తున్నారట. ముఖ్యంగా సినిమాలో హీరో ప్రభాస్ నటన, ప్రశాంత్ టేకింగ్, భారీ యాక్షన్ సీన్స్, విజువల్స్, రవి బస్రూర్ మ్యూజిక్, భువన గౌడ కెమెరా పనితనం వెరసి తప్పకుండా సలార్ రేపు రిలీజ్ తరువాత బాక్సాఫీస్ దగ్గర అరాచకం సృష్టించడం ఖాయం అని సమాచారం. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి