టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ గా అవతరించిన పూజ హెగ్డే ఇటీవల కాలంలో స్పెషల్ సాంగ్స్ లో కనిపించడం ఆమె అభిమానులకు ఏ మాత్రం నచ్చకపోయినా కూడా ఆమెకు మంచి పారితోషకం లభిస్తుంది అందుకే కాబోలు ఆమె ఈ విధంగా వరుస స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఇటీవలే ఎఫ్3 సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది బుట్ట బొమ్మ.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకోగా ఈ సినిమాకు వసూళ్లు మాత్రం పర్వాలేదు అనిపిస్తున్నాయి. ఈ సినిమా ఈ ఏడాది మంచి సక్సెస్ ను సాధించింది అని చెప్పొచ్చు. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచే విధంగా ఆయన ప్రయత్నాలు చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను పెట్టి దానిలో పూజా హెగ్డే చేసేలా చేసి ఈ చిత్రం యొక్క వెయిట్ ను మరింత పెంచాడు.
ఈ సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నా కూడా ఈ స్పెషల్ సాంగ్ ఈ సినిమా ఇంతటి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాట సక్సెస్ అయిన నేపథ్యంలో పూజా హెగ్డే ఉండడం వల్ల ఈ సినిమా కూడా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా యూత్ మాస్ ఆడియన్స్ కు స్పెషల్ సింగ్ బాగా నచ్చుతుంది. ఇక ఈ సినిమా యొక్క వసూళ్ళ విషయంలో ఇండస్ట్రీలో ఎంతో చర్చ జరుగుతుంది. ఇప్పటికే 70 కోట్ల రూపాయల వరకూ వసూలు రాబట్టిన ఈ సినిమా భవిష్యత్తులో 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం అని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా రావడం లేదని చెబుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి