దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే . ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు . ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది . ఇప్పటికే షూటింగ్ ను ప్రారంభించనున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది .

తదుపరి షెడ్యూల్ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తలపతి విజయ్ , వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కు తున్న మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తన కంటూ మంచి పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి , సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆ స్నేహం తోనే దళపతి విజయ్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో ఒక చిన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండడంతో ,  ఆ క్యారెక్టర్ లో మహేష్ బాబు నటించమని అడగగా ఇందుకు మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది .

ఇది ఇలా ఉంటే ఇప్పటికే సర్కారు వారి పాట మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో నటించబోతున్నాడు . ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: