
అలా సత్య దేవ్ నటించిన రెండు సినిమాలు ఇప్పుడు విడుదల కు సిద్ధం అవుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం అయన పలు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన `గుర్తుందా సీతకాలం` సినిమా. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయిన కూడా మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూశారు. తాజాగా ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ తాజాగా లాక్ అయ్యింది. చాలా రోజుల తర్వాత సత్య దేవ్ తన కెరీర్ లో ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంలో నటిస్తుండగా అందులో తమన్నా కథానాయికగా నటించడం విశేషం.
వివిధ దశలలో భిన్నమైన ప్రేమకథలను ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించబోతున్నారట. తమన్నా భాటియా- మేఘా ఆకాష్- కావ్య శెట్టి లాంటి టాప్ క్లాస్ హీరోయిన్ లు ఈ సినిమా లో నటించడం మరింత విశేషం. మరి అయన హీరో గా చేసిన మరో చిత్రం గాడ్సే అనే మరో చిత్రం కూడా విడుదలకు కు సిద్ధమవుతున్న నేపథ్యంలో గుర్తుందా శీతాకాలం సినిమా ఈ జూన్ 15 వ తేదీన విడుదల కావడం మరింత విశేషం. మరి విజయాలు అందుకోవా లో కాస్త వెంకపడ్డ సత్య దేవ్ కి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూద్దాం.