మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర విడుదలైన మొదటి షో కే నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఓవరాల్ గా ఆచార్య మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీ గా మిగిలిపోయింది. ఇలా ఆచార్య సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాట్ ను ఎదుర్కొన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ , మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ ,  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇలా వరుస సినిమాలు సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఆగిపోయింది అంటూ అనేక వార్తలు వచ్చాయి. కాకపోతే అవన్నీ రూమర్లే అని తర్వాత తేలిపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి,  వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో  తెగ వైరల్ అవుతుంది. తాజాగా దర్శకుడు వెంకీ కుడుముల,  మెగాస్టార్ చిరంజీవికి కథను వినిపించినట్లు , అయితే వెంకీ కుడుముల చెప్పిన కథను విన్న మెగాస్టార్ చిరంజీవి సెకండాఫ్ విషయంలో కాస్త అసంతృప్తి చెందినట్లు , దానితో మెగాస్టార్ చిరంజీవి సెకండాఫ్  కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని సూచనలు ఇచ్చినట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: