టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న దర్శకు లలో ఒకరు అయిన సుజిత్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుజిత్ శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. రన్ రాజా రన్ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న సుజిత్ మొదటి మూవీ తరువాత ఏకంగా బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న ప్రభాస్ మూవీ కి దర్శకత్వం వహించే అవకాశాన్ని సుజిత్ దక్కించుకున్నాడు .

అందులో భాగంగా సుజిత్ , ప్రభాస్ తో సహో అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించాడు. అనేక అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానితో సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. అలా సాహో మూవీ తో అపజయాన్ని ఎదుర్కొన్న సుజిత్ ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క మూవీ కి కూడా దర్శకత్వం వహిం చలేదు. ఇది ఇలా ఉంటే సుజిత్ తాజాగా ఓ క్రేజీ ఆఫర్ ను కొట్టేసి నట్లు తెలుస్తోంది.  మెగా హీరోలలో ఒకరు అయిన వరుణ్ తేజ్ హీరోగా సుజిత్ ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాట్లు ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది .

తాజాగా ఎఫ్ 3 సినిమాతో మంచి విజయం అందుకున్న వరుణ్ తేజ్ మరి కొన్ని రోజుల్లో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. అన్ని కుదిరితే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వాత వరుణ్ తేజ్ , సుజిత్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: