టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన సూర్య గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే తాను నటించిన అనేక తమిళ సినిమా లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ మార్కెట్ లో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య తాజాగా 'ఎతర్కుమ్ తునింధవం' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నే తెలుగు లో ఈటి పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ లో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా, వినయ్ రాయ్ , సత్యరాజ్మూవీ లో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి పాండిరాజ్ దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ కి డి. ఇమ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు.  ఎన్నో అంచనాల నడుమ 10 మార్చ్ 2022 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయింది. థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లు కూడా పెద్దగా రాలేదు.

థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన ఈ సినిమా తాజాగా జెమినీ టీవీ లో ప్రసారం అయ్యింది. మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయిన ఈ సినిమా 4.63 'టి ఆర్ పి' ని సొంతం చేసుకుంది. డబ్బింగ్ సినిమా అయి ఉండి,  థియేటర్ లలో పెద్దగా విజయం సాధించన ఈ సినిమా మొదటి సారి ప్రసారం అయినప్పుడు ఈ రేంజ్ లో 'టి ఆర్ పి' ని సాధించడం అనేది చెప్పుకోదగ్గ విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: