టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మెగా బ్రదర్ నాగబాబు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందలేకపోయిన నిర్మాతగా ట్రై చేద్దామని అనుకున్నాడు. కానీ నిర్మాతగా కూడా సక్సెస్ కాలేకపోయారు అని చెప్పవచ్చు. దీంతో బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఎంటర్టైన్మెంట్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక మరొక వైపు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు నాగబాబు. వృత్తిపరమైన జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితానికి అలాగే కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే.

తన తల్లిదండ్రుల పట్ల ఎంతో గౌరవంగా ఉండే నాగబాబు ఎప్పటికప్పుడు వారిపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే వెంటనే స్పందిస్తూ తనదైన శైలిలో వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా తన తల్లి అంజనాదేవి అంటే నాగబాబుకు ఎంతో గౌరవం. ఇక తన తల్లి పేరుమీద ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి పలు సినిమాలను కూడా నిర్మించారు. ఇక తన తల్లి పుట్టిన రోజు వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించిన నాగబాబు.. తాజాగా తన తండ్రి పుట్టిన రోజు కావడంతో తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు.

ఇక నాగబాబు తండ్రి కొణిదల వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహించారు. వృత్తిపరంగా కానిస్టేబుల్ అయినప్పటికీ బాపుగారి దర్శకత్వంలో మంత్రిగారి వియ్యంకుడు అనే చిత్రంలో నటించాడు. 2007లో గుండె సంబంధిత వ్యాధితో ఆయన మరణించారు. ఇకపోతే ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రి ఫోటో షేర్ చేస్తూ.. నువ్వు బ్రతికున్నప్పుడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనే జ్ఞానం నాకు లేదు.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. ఇప్పుడు చెప్పాలి అనుకున్నా నువ్వు లేవు.. అంటూ తన తండ్రి తలచుకొని ఎమోషనల్ అయ్యారు నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: