పాన్ ఇండియా స్టార్ గా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో ఉన్నారు.ప్రభాస్ నటిస్తున్న మొదటి మైథలాజికల్ చిత్రం ఆది పురుష్ . ఈ చిత్రం రామాయణం గాధ ఆధారంగా తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. దాదాపుగా ఈ సినిమాకు రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు జరిగింది. ఇక అంతే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాలో నటిస్తున్నారు.ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా నటిస్తున్నారు దాదాపుగా ఈ సినిమా కూడా అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించారు జరుగుతోంది. ప్రస్తుతం ఇలా పలు భారీ ప్రాజెక్టులతో షూటింగ్ జరుపుతున్నారు చిత్ర బృందం. ఇక ప్రాజెక్టు కే చిత్రీకరణ మొత్తం రామోజీ ఫిలిం సిటీ లో ఇప్పుడు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్ దీపిక పడుకొనే కూడా నటిస్తున్నది.

ఈ చిత్రం హిమాలయాలలో ట్రావెల్ స్టోరీగా తెరకెక్కించడం జరుగుతోంది ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన ఘట్టాల్ని కూడా చిత్రీకరించడం జరిగింది. దీంతో తాజాగా దీపికా పడుకొనే కు అస్వస్థతకు గురైంది. 20 మేరకు హార్ట్ బీట్ తేడా రావడంతో షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె కోరుకున్న వెంటనే సినిమా షూటింగ్ లో పాల్గొని తాజాగా కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది అందుకోసం ప్రభాస్ నిన్నటి రోజున చిత్రబృందం గ్రాండ్గా పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ పార్టీ లో అమితాబ్ బచ్చన్ తో పాటు చిత్ర బృందం మొత్తం తోపాటు దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: