2022 వ సంవత్సరం సగం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజల ముందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎన్నో సినిమాలు ఘన విజయాలు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులను సృష్టించాయి.  భారీ వసూలను కూడా సాధించుకున్నాయి. అలాగే భారీ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.  ఎన్నో అంచనాల మధ్య తేరకెక్కి ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇకపోతే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన చిన్న సినిమాలు సైతం సంచలనాత్మక విజయాలను అందుకున్నాయి.  అలా ఈ మొదటి అర్ధ భాగంలో ప్రేక్షకులను అలరించిన నిరాశపరిచిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది మొదటి నెలలోనే కొన్ని సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. 

ఆపై ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మంచి ఘనవిజయం సాధించి భారీ వసూలను సాధించింది. ఇక కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కేజిఎఫ్ సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ చిత్రం భారీ వసూలను సాధించి ఒక పెద్ద సినిమా సాధించే కలెక్షన్లను సాధించుకుంది. ఇక తమిళనాడు నుంచి వచ్చిన విక్రమ్ సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకుంది.  దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ రెండో అర్థ భాగంలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: