కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శింబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న శింబు తాను నటించిన తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు . 

శింబు టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధ సినిమాతో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.  ఇది ఇలా ఉంటే గత కొద్ది కాలంగా వరుస అపజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన శింబు , వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన మనాడు సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. మనాడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శింబు ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం శింబు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెందు తనింధతు కాదు అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 15, 2022న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.

ఇది ఇలా ఉంటె ఈ సినిమాతో పాటు పాతు తాల అనే ఈ సినిమాలో కూడా శింబు హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ మూవీ ని డిసెంబర్ 14, 2022న థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు ఒబెలి ఎన్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇలా మానాడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శింబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: