తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు.. కానీ అగ్ర కథానాయకిగా పేరుపొందింది హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నది.. ఒకవైపు తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటిస్తే వరుస ఆఫర్లను అందుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం యశోద ఖుషి వంటి చిత్రాలలో నటిస్తున్నది ఈ అమ్మడు. ఈ సినిమా షూటింగులు కూడా చాలా శరవేగంగా జరుపుకుంటూ ఉన్నాయి. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది సమంత. సమంత ముఖ్యమైన పాత్రలో హిందీలో ఒక సినిమా చేయబోతోంది అంటూ గతంలో కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి.


తాజాగా సమంత ఈ విషయంపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది హీరోయిన్ తాప్సి.. ముఖ్యమైన పాత్రలు నటించి శభాష్ మీరు సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నది తాప్సి. సమంత ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ విషయంపై స్పందించింది. సమంత ముఖ్యమైన పాత్రలో తాను నిర్మిస్తున్న ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా తెలియజేసింది. అంతేకాకుండా కంటెంట్ లో ప్రాముఖ్యతను బట్టి అందులో తాను కూడా ఒక కీలకమైన పాత్రలో నటించే అవకాశం ఉందని తెలియజేసింది తాప్సి.


సినిమా నిర్ణయించడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది అలాగే తాను దక్షిణాదిలో సినిమాలు చేసేందుకు కూడా చాలా సిద్ధంగా ఉన్నాను కానీ గడిచిన రెండేళ్లలో తన పై తనకు ఎక్కువ విశ్వాసం ఉందని అందుచేతను ఇప్పటికే కొన్ని తప్పు  ప్రాజెక్టులను ఎంపిక చేసుకొని.. తనకి సంతృప్తి కలిగించలేదని తెలియజేసింది. తనకు ఎప్పుడూ కూడా సవ్వాలని స్వీకరించేందుకు సిద్ధంగానే ఉంటానని తెలియజేసింది తాప్సి. మరి ఈ ముద్దుగుమ్మ తెరకెక్కించే సినిమా ఎలా ఉండబోతుందో అంటూ సమంత అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా హీరోయిన్ నుండి తాప్సి డైరెక్టర్ గా మారి తన కెరీర్ ని ఎలా కొనసాగిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: