ఇక తమిళ స్టార్ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యంత ఫ్యాన్ క్రేజ్ ఉన్న హీరోలలో ఖచ్చితంగా సూర్య కూడా ఒకరు.ఎన్నో విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ఇటీవల తను నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలతో నేషనల్ లెవెల్ లో బాగా పాపులర్ అయ్యి ఆకాశం నీ హద్దురా సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు.ప్రస్తుతం ఈ హీరో వాడీవాసల్ అనే సినిమా చేస్తున్నారు.ఇక గత కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న సూర్య.. తాజాగా తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి గడుపుతున్నారు. ఇక ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి ముంభై వెళ్లిన సూర్య.. అక్కడున్న ఓ రెస్టారెంట్‏కు తన సతీమణి జ్యోతిక ఇంకా పిల్లలతో కలిసి వెళ్లారు. అయితే ఇక ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన ఈ స్టార్ హీరో కెమెరామెన్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.. 


ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.తన భార్య జ్యోతిక ఇంకా అలాగే పిల్లలతో కలిసి సూర్య ముంబైలోని బాస్టియనల్ వోర్లీ హోటల్ కు వెళ్లారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత వారిని ఫోటోగ్రాఫర్లు పలకరిస్తూ ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. సూర్య ఇంకా జ్యోతిక ఫోటోలకు ఫోజులిచ్చి అక్కడి నుంచి కారు దగ్గరకు వచ్చారు. అయితే ఫోటోగ్రాఫర్స్ సూర్య పిల్లలను సైతం ఫోటోలకు ఫోజులివ్వమంటూ వారిద్దరి ఫోటోస్ తీయబోయే ప్రయత్నం చేశారు. దీంతో ఇక సూర్య కెమెరామెన్స్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కెమెరాలకు చెయ్యి అడ్డం పెట్టి ప్లీజ్ మా పిల్లల్ని వదిలేయండి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: