సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయిన సోనూసూద్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోనుసూద్ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో అనేక పాత్రలలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఎక్కువగా సోనూసూద్ తెలుగు లో ప్రతి నాయకుడి పాత్రలలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సోనూసూద్ హిందీ సినిమా అయి నటు వంటి పృథ్వీరాజ్ సామ్రాట్ అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా , ఈ మూవీ లో మనుషా చిల్లర్ హీరోయిన్ గా నటించింది. కొంతకాలం క్రితమే ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది.

కాకపోతే ఈ సినిమా థియేటర్ లలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. 175 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 90 కోట్ల కలెక్షన్ లను మాత్రమే రాబట్టి ఫెయిల్యూర్ మూవీ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సోనూసూద్ 'పృథ్వీరాజ్ సామ్రాట్' మూవీ ఫెయిల్యూర్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సోనూసూద్ 'పృథ్వీరాజ్ సామ్రాట్' మూవీ లో ఆస్థాన కవి చాంద్ బర్దాయ్ పాత్రను పోషించాడు. పృథ్వి రాజ్ సామ్రాట్ ఒక ప్రత్యేకమైన సినిమా అని, ఈ మూవీ లోని చాంద్ బర్దాయ్ పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమని సోను సూద్ పేర్కొన్నాడు. తన కెరీర్ లో ఈ మూవీ ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ గా నిలిచిపోతుంది అని సోనుసూద్ పేర్కొన్నాడు. నిజానికి పృథ్వి రాజ్ సామ్రాట్ మూవీ మంచి విజయం సాధించి ఉండవలసింది.  ఎందుకంటే ఈ మూవీ ని ఎంతో కష్టపడి నిర్మించారు అంటూ సోనూసూద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: