ఈమధ్య తెలుగు సినిమాలు ఆడినంతగా మరే ఇండస్ట్రీ సినిమాలు ఆడట్లేదు. మన ఆడియెన్స్ కి సినిమా మీద ఉన్న ప్యాషన్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది. అయితే మధ్యలో కొన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు. అయితే అది కేవలం సినిమాల తప్పే కానీ ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని ఆదరిస్తారని తెలుస్తుంది. అంతకుముందు వారం వచ్చిన బింబిసార, సీతారామం సినిమాలు సూపర్ సక్సెస్ అవగా లేటెస్ట్ గా వచ్చిన కార్తికేయ 2 కూడా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలాఉంటే తెలుగు సినిమాలు చూసేందుకు స్టార్ సెలబ్రిటీస్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు సినిమా చూసినట్టు తెలుస్తుంది. అదికూడా మహేష్ ఏ.ఎం.బి మాల్ లో చూశారట. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వారసుడు అనే సినిమా చేస్తున్నారు విజయ్. ఆ సినిమా షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చారు. అయితే ఖాళీగా ఉండటంతో ఏ.ఎం.బి సినిమాస్ లో సినిమా చూశారట. ఇంతకీ దళపతి విజయ్ చూసిన సినిమా ఏది అంటే కళ్యాణ్ రాం బింబిసార అని తెలుస్తుంది.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా బింబిసార. ఈ సినిమా సూపర్ హిట్ అవడం నందమూరి ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. సినిమా హిట్ అవడంతో విజయ్సినిమా చూసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా చూసేందుకు దళపతి విజయ్ ఏ.ఎం.బి మాల్ కి వచ్చారు. తన టీం తో కలిసి బింబిసార సినిమా చూశారు దళపతి విజయ్. బింబిసారతో వచ్చిన సీఎతారామం సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది. విజయ్ మాత్రం బింబిసార సినిమా చూసి మెచ్చినట్టు తెలుస్తుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వారసుడు సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమాలో రష్మిక మందన్నతో జోడీ కడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: