మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూవీ లలో గాడ్ ఫాదర్ మూవీ ఒకటి. ఈ మూవీ మలయాళం లో మంచి విజయం సాధించిన లూసిఫర్ మూవీ కి అధికారిక రీమిక్ గా తెరకెక్కింది. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ , నయన తారమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే గాడ్ ఫాదర్ మూవీ బిజినెస్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు కూడా ఇప్పటికే అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను 'ఫార్స్ ఫిల్మ్' అనే ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా ఆచార్య మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. గాడ్ ఫాదర్ మూవీ పై మెగా అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: