తెలంగాణలో నారాయణపేట ప్రాంతంలో ఉన్న కొంతమంది మహిళ సంఘాలకు ఈ జంట చేనేత వ్యాపారాల కు వీరికి తోచిన విధంగా చేయూతనిచ్చేందుకు ముందుకు రావడం జరిగినట్లుగా తెలుస్తోంది. అరుణ్య నారాయణపేట పేరుతో ఆన్లైన్లో కొన్ని వస్త్రాల వ్యాపారాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ తాజాగా మహేష్ నమ్రతాలను కలిసినట్లుగా తెలుస్తోంది ఈ సందర్భంగా అక్కడి మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడుతున్న ఎంతోమంది మహిళలకు కృషిని మహేష్ దంపతులు ప్రశంసించడం జరిగింది. ఇక వారు చేస్తున్న పనిని మరొక స్థాయికి తీసుకు వెళ్లేందుకు ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు మహేష్ బాబు.ఇక మహేష్ బాబు నమ్రత అందిస్తున్న ఈ ప్రోత్సాహం తమకు చాలా ఉత్సాహం ఇస్తుందని అరుణ్యా నారాయణపేట సంస్థ ప్రతినిధులు తెలియజేయడం జరుగుతుంది. ఇక అందుకు సంబంధించి మహేష్ నెంబర్ తో దిగిన ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీంతో మహేష్ అభిమానులు సైతం మరొకసారి తన గొప్ప మనసు చాటుకున్నాడని అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటించబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి