టాలీవుడ్ ఇండస్ట్రీకి హ్యాపీ డేస్ సినిమా ద్వారా  పరిచయమైన తమన్న  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .హ్యాపీ డేస్  సినిమా వల్ల నటిగా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. ఆ సినిమా  తర్వాత తెలుగులో హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది.అనంతరం తెలుగు, తమిళ హిందీ, అని తేడా లేకుండా అన్ని భాషలలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి తమన్నా ఇప్పటికీ ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు బబ్లీ బౌన్సర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈమె నటించిన  మొదటి మహిళా బౌన్సర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ క్రమంలో సినిమా యూనిట్ సినిమా ప్రమోషన్ పనులలో జోరుగా పాల్గొంటుంది.ఈ  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్న ఇటీవల బిగ్ బాస్ తెలుగు షోలో కూడా హాజరైంది.ఇదిలావుంటే  ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నాని విలేకరి ప్రశ్నిస్తూ.. మళ్ళీ ఏ హీరోతో నటించాలని ఉంది అడగ్గా..తనకు సైఫ్ అలీఖాన్‌ తో కలిసి నటించాలని ఉందని వెల్లడించింది.

అంతేకాదు గతంలో సైఫ్ అలీఖాన్‌, తమన్నా 2014లో వచ్చిన Humshakals సినిమాలో కలిసి నటించారు.  మరొకసారి సైఫ్ అలీ ఖాన్ తో నటించే అవకాశం కోసం తమన్న ఎదురుచూస్తోంది.తమన్నా లీడ్ రోల్ చేసిన బబ్లీ బౌన్సర్ సినిమా సెప్టెంబర్ 23 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కాగా తమన్నా తదుపరి సినిమాల విషయానికి వస్తే తెలుగు హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తోంది. ఇటీవల తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన తమన్న ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు  ప్లాన్ ఏ ప్లాన్ బీ, భోలే చుడియాన్‌ వంటి హిందీ సినిమాలలో కూడ నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: