తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు ఉందొ కూడా మనందరికి తెలిసిందే.అయితే ఇక ఈ కుటుంబం నుంచి నటులుగా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.అంతేకాదు ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న తదితర హీరోలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే  ఇక కళ్యాణ్ రామ్ మాత్రం కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు.ఇక  సినిమాల పరంగా తక్కువ సక్సెస్ లో ఉన్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం 

తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు.ఇకపోతే కళ్యాణ్ రామ్ రవితేజ తో కలిసి కిక్-2 సినిమాని నిర్మించారు.ఇక ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు కళ్యాణ్ రామ్. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం సురేందర్ రెడ్డి వ్యవహరించారు.కాగా  ఈ సినిమాతో కొన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లడం జరిగింది.ఇక  దీంతో తనకి ఉన్న కొన్ని ఆస్తులను కూడా అమ్మినట్లు సమాచారం. ఇకపోతే కిక్ సినిమా హిట్ కోటడంతో కిక్ 2 కూడా మంచి విజయవంతం అవుతుందని అంచనా వేశారు కళ్యాణ్ రామ్.. కానీ ఈ చిత్రం ఘోరంగా ప్లాప్ ను చవిచూసినది.

అయితే  ఇక ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ కావడానికి గల ముఖ్య కారణం ఈ సినిమాని చాలాసార్లు రీ షూట్ చేయడమే అని చెప్పవచ్చు.ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు.ఆ తర్వాత తన తమ్ముడితో కలిసి జై లవకుశ సినిమాని నిర్మించగా ఈ సినిమాతో మిగిలిన అప్పులను కట్టేసి కాస్త లాభాలలో నిలిచారని చెప్పవచ్చు. ప్రస్తుతం బింబిసార సినిమానీ తన బ్యానర్ పై నిర్మించి నిర్మాతగా వ్యవహరించి మరింత లాభాల బాటలో చేరాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: