సినిమా ఎంత బాగా తెరకెక్కించినప్పటికీ ఆ సినిమాకు ఎంతో బాగా ప్రమోషన్స్ చేస్తేనే చివరికి సినిమా విజయం సాధించి గట్టెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఇలా చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాలు వరకు ప్రమోషన్స్ అనేది మాత్రం తప్పనిసరిగా మారిపోయింది. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచి దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్లు అందరూ కూడా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా దర్శనమిస్తున్నారు. కాగా అక్టోబర్ 5వ తేదీన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి అన్న విషయం తెలిసిందే.


 ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ఘోస్ట్ ఇక మరో సినిమా స్వాతిముత్యం ఉన్నాయి. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ది గోస్ట్ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. నా సినిమాతో పాటు చిరంజీవి గారి సినిమా కూడా అదే రోజు విడుదలవుతుంది. ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నా.. నాకు అత్యంత సన్నిహితుడు చిరంజీవి అంటూ నాగార్జున విష్ చేశాడు.


 అయితే స్వాతిముత్యం అనే సినిమా పేరు ఎత్తడం మాత్రం నాగ్ మర్చిపోయాడు. విమర్శలు చేయడానికి ఎప్పుడు చాన్స్ దొరుకుతుందాఅని ఎదురుచూసే రోజులు ఇవి. ఇక స్వాతిముత్యం సినిమా పేరు తీయకపోయేసరికి చిన్న సినిమాలు అసలు నాగార్జున కంటికి కనిపించవా అంటూ కొంతమంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే చిరంజీవి మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది. ఇటీవల గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ క్రమంలోనే మాట్లాడిన చిరంజీవి తన సినిమాతో పాటు నాగార్జున గోస్ట్ సినిమా మరో చిన్న సినిమా స్వాతిముత్యం కూడా మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇలా నాగర్జున చేసిన తప్పు తాను చేయకుండా విమర్శకులకు టార్గెట్ కాకుండా మెగాస్టార్ చిరంజీవి కాస్త జాగ్రత్త పడ్డాడు అన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: