మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ధమాకా అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సినిమా చూపిస్తా మామ ,  నేను లోకల్ , హలో గురు ప్రేమకోసమే వంటి మూవీ లకు దర్శకత్వం వహించిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని సాంగ్స్ ని కూడా విడుదల చేసింది. ఈ పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ధమాకా మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరో ఒకటి రెండు రోజుల్లో ధమాకా మూవీ విడుదల తేదీని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీ ని పక్క మాస్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో అద్భుతమైన కామెడీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం రవితేజ వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: