పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో 'అత్తారింటికి దారేది'ఒకటి. బహుబలి సినిమా కన్నా ముందు అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా రికార్డు ఈ సినిమా పేరిట ఉండేది.
విడుదలకు ముందే పైరసీ, ప్లాప్ టాక్ లను దాటుకుని వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సినిమా విడుదలై నేటికి తొమ్మిందేండ్లు అవుతోంది. ఈ సందర్బంగా అత్తారింటికి దారేది సినిమా గురించి కొన్ని ఇంటస్ట్రింగ్ విషయాలు మీకోసం..

సినిమా కథను పవర్ స్టార్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కేవలం ఒక్క ఫోన్ కాల్ లోనే వినిపించారంటా. స్టోరీ విని పవర్ స్టార్ త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. సినిమాలో అత్త క్యారెక్టర్ మెయిన్ రోల్ కావడంతో ఆ రోల్ లో ఎవరిని ఎంపిక చేశారని త్రివిక్రమ్ పవన్ అడిగారట.. నదియా అని చెప్పగానే కన్విన్స్ అయ్యారట.

ఈ సినిమాకు మరదలు క్యారెక్టర్ కోసం సమంత స్థానంలో మొదట ఇలియానాను తీసుకోవాలని భావించారట. అప్పటికే వారిద్దరూ జల్సాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతో గోవా బ్యూటీ అయితే బాగా సెట్ అవుతుందనుకున్నారంటా.

కానీ డేట్స్ కుదరకపోవడంతో ఇలియాన నో చెప్పడంతో. ఆ స్థానంలో సమంతను తీసుకున్నారంట. ఇక ఈ సినిమాలో ఫారెయిన్ లొకేషన్స్ ను సెర్చ్ చేయడానికి మొదటి సారిగా పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్వయంగా స్పెయిన్ వెళ్లారంటా. సుమారు 30 నుంచి 45 రోజుల పాటు అక్కడ షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారంట.

ఈ సినిమాలోని ఇట్స్ టైమ్ టు సాంగ్ కోసం మొదట అనసూయను ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ ఆమె ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారు. దీంతో ముంతాజ్ ను ఎంపిక చేశారు. షూటింగ్ సమయంలో నదియాకు తెలుగులో డైలాగ్స్ ఎక్స్ ప్లెయిన్ చేసే సమయంలో త్రివిక్రమ్ బాగా నవ్వుకునే వారట. దీంతో త్రివిక్రమ్ అక్కడ ఉంటే తాను ఆ సీన్ చేయనని నదియా పవన్ కు కంప్లైంట్ చేసేవారు.

ఈ సినిమాకు అవార్డుల పంట పండింది. 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సినిమాకు 4 అవార్డులు వచ్చాయి.బెస్ట్ ఎంటర్ టైనర్, ఫిల్మ్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజికట్ డైరెక్టర్ అవార్డులను సొంతం చేసుకుంది. 2013 సైమాలో బెస్ట్ ఫిల్మ్, డైరెక్టర్,బెస్ట్ యాక్టరెస్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. 2013లో 4 నంది అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరెస్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డులు వచ్చాయి.

ఈ సినిమాను కన్నడలో రన్నా కిచ్ పేరిట రీమేడ్ చేయగా సుదీప్ ఇందులో లీడ్ రోల్ పోషించారు. తమిళంలో వంత రాజవతన్ వరువెన్ లో శింబు, బెంగాలీలో అభిమాన్ పేరిట రీమేడ్ చేశారు. ఈ సినిమా టీజర్ కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. యూట్యూట్ లో విడుదల చేయగానే 9,000 లైకులు పొందిన టీజర్ గా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ట్రైలర్ కు రిలీజ్ చేసిన 70 గంటల్లోనే 1,004,850 వ్యూవ్స్ ,11,000 లైక్స్ వచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 187 కోట్లు వసూలు చేసింది . ఆ తర్వాత ఆ రికార్డును బాహు బలి బద్దలు కొట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: