మొదటి సినిమా కంచె సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..అందం, అభినయం వున్న కూడా నటిగా పెద్దగా గుర్తింపు పొందలేదు..ఆమె నటించిన సినిమాలు హిట్ అయినా పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. అయితే,ప్రగ్యా కెరీర్ ముగిసిపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శకులే కారణం అని తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ తెలుగులో కంచె మూవీ ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. దీనికి క్రిష్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తెలుగులో నటించిన సినిమాలు కమర్షియల్ హిట్స్ అందుకుంది.


అందులో తన డెమ్యూ మూవీ కంచె ఉండగా.. రీసెంట్‌గా అఖండ మూవీలో నటించి భారీ సక్సెస్ అందుకుంది. యాభై ఏళ్ల వయస్సున్న బాలయ్యబాబుతో నటించిన ప్రగ్యా.. తన తండ్రి వయస్సున హీరోలతో నటించడమే తప్పని కొందరు అంటున్నారు. ప్రగ్యా తనకంటే వయసులో పెద్ద హీరోలతో నటించి తన కెరీర్ పాడుచేసుకుందని కొందరు అంటున్నారు. ఎందుకంటే ముసలి హీరోలతో కలిసి నటించడమే ఆమె చేసిన తప్పు అని అనేవారు లేకపోలేదు.అదే ఆమెకు మైనస్ పాయింట్ అయీంది....
దాంతో అమ్మడుకు సినీ అవకాశాలు అందని ద్రాక్షలాగా మారాయి..ప్రగ్యాజైస్వాల్ ఇతర భాషల్లో అవకాశాలు దక్కించుకున్నా తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడానికి దర్శకులు కూడా కారణం అని తెలుస్తోంది.ఇప్పటివరకు ప్రగ్యా నటించిన సినిమాల్లో దర్శకులు ఆమెకు ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ ఇవ్వడమే కారణం అని కూడా కొందరు అంటున్నారు. కంచె దర్శకుడు క్రిష్, అఖండ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్,ఆచారి అమెరికా యాత్ర, జయ జానకి నాయక వంటి సినిమాల్లో దర్శకులు ప్రగ్యాకు సరైన రోల్ ఇవ్వకపోవడం వలన కూడా తన కెరీర్ ముగిసిపోవడానికి కారణం అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి... ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చురుగ్గా ఉంటూ అభిమానులకు హీట్ ఎక్కించె ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఫ్యుచర్ లో అయిన మంచి సినిమా పడుతూందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: