
చివర్లో అందరూ సూర్య కే ఎక్కువ ఓట్లు వేశారు..చివరికి రోహిత్ భార్య మెరీనా కూడా రోహిత్ ని కాదని సూర్య కి వోట్ వేస్తుంది..కానీ వాసంతి మాత్రం రోహిత్ కి సపోర్టు చేస్తుంది..అలా అతను చేసిన త్యాగానికి వాసంతి నడుచుకున్న తీరు ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా ఎంతగానో నచ్చింది.
అయితే రోహిత్ వాసంతి కోసం మరియు ఇంటి సభ్యుల కోసం చేసిన త్యాగానికి బదులుగా నాగార్జున ఎవరినో ఒకరిని రోహిత్ కోసం త్యాగం చెయ్యాలి అని అడుగుతారు మరి, అప్పుడు రోహిత్ కోసం ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధం అంటూ ఇంటి సభ్యులు ముందుకు వస్తారు..అప్పుడు నాగార్జున గారు రోహిత్ ని నువ్వు ఎవరినో ఒకరిని ఎంచుకో అంటాడు అంట ..రోహిత్ ఇబ్బంది పడుతూనే వాసంతి పేరు చెప్తాడు..వాసంతి వెంటనే ముందుకి వచ్చి ఎలాంటి త్యాగం చేయడానికైనా నేను రెడీ గా వుంటా అని అంటుంది..అప్పుడు ఆమెని నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిచి 'నీ జుట్టుని భుజానికి వరుకు కట్ చేసుకోవాలి' అని అడుగుతాడు మరీ
దానికి వాసంతి ఆనందంగానే ఒప్పుకుంటుంది..ఆ తర్వాత ఆమె హాల్ లోకి వచ్చిన తర్వాత కెప్టెన్ సూర్య ఆమె జుట్టుని కత్తిరిస్తాడు..అప్పుడు ఆది రెడ్డి వెంటనే కల్పించుకొని..సార్ ఆ అమ్మాయి చేసిన త్యాగం రోహిత్ కి ఉపాయాగపడాలి కదా అని అడుగుతాడు..అప్పుడు నాగార్జున రోహిత్ కోసం అతని డాడీ పంపిన వీడియో ని చూపిస్తాడు నాగార్జున సర్ ..అది చూసిన తర్వాత రోహిత్ మరియు మెరీనా ఇద్దరు బాగా ఎమోషనల్ అవుతారు అంటా మరీ ..ఈ భాగం మొత్తం ఈరోజు ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది అనూకొండి మరి.