
ఈ మూడు సినిమాలు కూడా కామెడీ ట్రాక్ లో వచ్చినవే.. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకుని విజయాలను అందించాయి. ఆ తర్వాత కామెడీ జోనర్ వదిలేసి.. డిఫెరెంట్ కథలను చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు తాజాగా "జిన్నా" అనే సినిమాతో మళ్ళీ కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమా రేపు గ్రాండ్ గా విడుదల కానుంది.. అయితే ఇంతకు ముందు హీరోగా మాత్రమే ఉన్న మంచు విష్ణు, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా జిన్నా సినిమాతో మన ముందుకు రానున్నాడు. జిన్నా ప్రమోషన్ కార్యక్రమాల్లో విష్ణు మాట్లాడిన మాటలతో బాగా వైరల్ అయ్యాడు మరియు సినిమా కూడా చర్చల్లో ఉంది.
అందుకే అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇందులో విష్ణు సరసన సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు విష్ణు నిర్మాత కాగా ఇషాన్ సూర్య దర్శకత్వ బాధ్యతలను చూసుకున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర మరియు సత్యం రాజేష్ లు వివిధ పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ కారణంగా మొదట్లో వివాదాలను సైతం ఎదుర్కొంది. మరి మంచు విష్ణు హీరోగా మరియు నిర్మాతగా ఈ సినిమాతో హిట్ ను అందుకుంటాడా చూడాలి.