ఇక నిజ జీవిత కథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించినట్లు నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి తెలిపాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టి పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ పాత్రలో అతను ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి పాత్రలో ఎవరు నటించినా అతనిలా పాత్రకు ప్రాణం పోసే వారు కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కాంతార సినిమాలో ముందుగా రిషబ్ శెట్టి హీరోగా చేయాలని అనుకోలేదట.
ముందుగా కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కోసం ఈ కథను సిద్ధం చేశారట రిషబ్ శెట్టి. కానీ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది ఆకస్మిక గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ లేకపోవడంతో ఇక ఆ పాత్రలో మరొకరు సెట్ కారు అని భావించి ఇక ఆ స్టోరీ రాసుకున్న తానైతేనే పాత్రకు న్యాయం చేస్తానని అనుకున్నాడట రిషబ్ శెట్టి. ఈ క్రమంలోనే ఇక తానే హీరోగా నటించినట్లు వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు కాంతార సినిమాలో పునీత్ రాజ్కుమార్ నటించి ఉంటే మరో లెవల్ లో ఉండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి