గుండెపోటు అంటే ఏమిటి?
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీల్లో కొవ్వు చేరడం వల్ల రక్తప్రవాహం అడ్డుపడుతుంది. దీని వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి, గుండెపోటు సంభవిస్తుంది.
గుండెపోటు వచ్చే ముందు కనిపించే ముఖ్య లక్షణాలు:
1. ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి
ఇది గుండెపోటుకు ప్రధాన లక్షణం. ఛాతీలో బరువుగా అనిపించడం..బిగుతుగా లేదా కాలుతున్నట్లుగా నొప్పి..కొన్ని నిమిషాలు ఉండి తగ్గి మళ్లీ రావచ్చు. ఈ నొప్పిని చాలామంది గ్యాస్ సమస్యగా లేదా కడుపు నొప్పిగా పొరపాటు పడతారు.
2. ఎడమ చేయి, భుజం, మెడ లేదా దవడకు నొప్పి
ఛాతి నుంచి నొప్పి ఈ భాగాలకు వ్యాపించవచ్చు. ముఖ్యంగా ఎడమ చేయిలో నొప్పి లేదా మత్తుగా అనిపించడం. మెడ లేదా దవడ నొప్పి.
3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
కొద్దిగా నడిచినా ఊపిరి ఆడకపోవడం. విశ్రాంతిలో ఉన్నప్పటికీ శ్వాస ఇబ్బంది. ఛాతి నొప్పి లేకపోయినా ఈ లక్షణం రావచ్చు
4. అధిక చెమటలు పట్టడం
చల్లని చెమటలు అకస్మాత్తుగా పట్టడం. శ్రమ చేయకపోయినా చెమటలు రావడం. ఇది శరీరం అత్యవసర పరిస్థితిలో ఉందని సూచిస్తుంది.
5. అలసట మరియు బలహీనత
సాధారణ పనులు చేసినా తీవ్రమైన అలసట. కారణం తెలియని నీరసం. ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది
6. తల తిరగడం లేదా మూర్ఛకు దగ్గరగా అనిపించడం
తల తేలిపోతున్నట్లుగా అనిపించడం. ఒక్కసారిగా చూపు మసకబారడం. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల ఇలా జరుగుతుంది
7. వికారం, వాంతులు లేదా కడుపు నొప్పి
గుండెపోటు లక్షణాలు కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ సమస్యలాగా అనిపించవచ్చు. కడుపులో మంట, వికారం, వాంతులు..ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
8. నిద్రలో ఇబ్బంది, ఆందోళన
కారణం లేకుండా భయం లేదా ఆందోళన..రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం “ఏదో తప్పు జరుగబోతోంది” అనే భావన
మహిళల్లో లక్షణాలు కొంచెం భిన్నంగా ఉండవచ్చు:
తీవ్రమైన అలసట,వెన్ను నొప్పి,వికారం,శ్వాస సమస్య. ఛాతి నొప్పి లేకపోయినా గుండెపోటు రావచ్చు
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
పొగ త్రాగేవారు, డయాబెటిస్ ఉన్నవారు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, కుటుంబ చరిత్ర ఉన్నవారు, స్థూలకాయం (ఊబకాయం)
ఏమి చేయాలి?
పై లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే:
వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి. స్వయంగా మందులు వేసుకోవద్దు గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం కీలకం. గుండెపోటు ముందస్తు హెచ్చరికలను శరీరం తప్పకుండా ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి గుర్తించి వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నియమిత వైద్య పరీక్షలు గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి