మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తీసుకుంటున్న సినిమా నిర్ణయాలపై సోషల్ మీడియాలో, అభిమానుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఓ ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇచ్చాడన్న వార్తలు బయటకు రావడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడం ఖాయమని కొందరు ముందే అంచనాలు వేస్తున్నారు. చిరంజీవి స్థాయికి తగ్గ దర్శకుడిని ఎంపిక చేయకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి నటించి  సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు అన్న  సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత అభిమానులు చిరంజీవి నుంచి మరిన్ని భారీ హిట్లు ఆశించారు. అయితే ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ కావడం, అంతకుముందే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కు అంగీకరించడం చర్చకు దారితీసింది. ఇప్పుడు లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం ప్రకారం, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా సాబ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.  ఆ సినిమాను చాలా చెత్తగా తెరకెక్కించాడని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అలాంటి దర్శకుడికి చిరంజీవి లాంటి మెగాస్టార్ ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

ముఖ్యంగా మారుతి సినిమాల్లో కనిపించే ఓవరాక్షన్, లాజిక్ లేని సన్నివేశాలు, చీప్ కామెడీ ట్రాక్‌లను చిరంజీవిపై కూడా రుద్దితే మాత్రం ఈ సినిమా కూడా దారుణంగా దెబ్బతింటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి లాంటి నటుడికి స్ట్రాంగ్ కథ, పవర్‌ఫుల్ క్యారెక్టర్, మెగాస్టార్ ఇమేజ్‌ను ఎలివేట్ చేసే కథనం అవసరం అని అభిమానులు స్పష్టంగా చెబుతున్నారు.మొత్తానికి చిరంజీవి వరుసగా తీసుకుంటున్న దర్శకుల ఎంపికలపై అనుమానాలు పెరుగుతున్నాయి. అభిమానుల ఆశలు, అంచనాలకు తగ్గట్లుగా చిరంజీవి సరైన నిర్ణయాలు తీసుకుంటాడా? లేక ఇదీ మరో నిరాశగా మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: