తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయిన అల్లు శిరీష్ తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాకేష్ శశి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో అను ఇమ్మానుయేల్ , అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ ని రేపు అనగా నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.  ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

దానితో ఈ మూవీ పై సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఊర్వశివో ఓ రాక్షసివో మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల మేర ప్రే రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ మూవీ 7.5 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7.5 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊర్వశివో రాక్షసివో మూవీ క్లీన్ హెట్ గా నిలుస్తుంది.

మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉన్న నేపథ్యంలో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: