సరే సోలో హీరోయిన్గా కాకపోయినా పలు సినిమాలను సైడ్ క్యారెక్టర్ లో నటించి మంచి పాత్రలలో నటించింది ఆండ్రియా. తాజాగా విజయ్ మాస్టర్ సినిమాలో కూడా ఆంటీగా ఒక చిన్న పాత్రలో నటించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ కెరియర్లో చేసిన కొన్ని తప్పుల వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలో హీరోయిన్ గా ఉన్న సమయంలో తన ఫోకస్ మొత్తం కెరియర్ మీద ఉంచినట్లు అయితే ఈమె రేంజ్ మరొకలాగా ఉండేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పలు సినిమాలలో ఏమే హాట్ ఫోజులు ఇవ్వడమే కాకుండా బోల్డ్ గా కూడా నటించడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురి కలిగించింది.
కోలీవుడ్లో తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటుల సైతం మంచి పొజిషన్లో ఉండగా ఆండ్రియా మాత్రం ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అంతే కాకుండా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసి ఫోటోలు కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ లో మరింత అందంగా కనిపిస్తోంది ఆండ్రియా. ఆండ్రియా కొద్దిగా కష్టపడితే మంచి అవకాశాలు వస్తాయని కామెంట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి