టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సమంత. ఇక నాగచైతన్య ను వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విడిపోవడంతో ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక తాజాగా మయోసైటీస్ అనే వ్యాధి భారీ పడినట్లు తెలియజేసింది. ఇక సమంత నటించిన చిత్రాలలో యశోద చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. దీంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లోని విడుదల చేశారు చిత్ర బృందం. ఈ చిత్రానికి డైరెక్టర్ హరి హరీష్ దర్శకత్వం వహించారు. ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రావడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.



యశోద సినిమా నుంచి విడుదలైన టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత సమంత సినిమా విడుదల కావడంతో అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. ఇప్పటికే సమంత ఈ సినిమాకు సంబంధించి భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే యశోద సినిమాను చూసినవారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఈ చిత్రంతో సమంత సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.


సినిమా చూడడానికి ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్ తో ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ డీసెంట్గా చాలా ఇంట్రెస్టింగ్ లైన్ తో ఉందంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే సరోగసి ఆస్పత్రిలో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో ఈ సినిమా ఒక మలుపు తిరుగుతుందని చూసినవారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశం ఈ చిత్రానికే హైలెట్గా నిలిచేలా ఉందని సమాచారం. ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమా థ్రిల్లింగ్ గా మారిపోయింది అని అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా మారిందని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. సమంత ఎప్పటిలాగానే ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది అని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: