ఓవర్ నైట్ స్టార్ అంటే విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది.. అర్జున్ రెడ్డి సినిమా తో బాగా పాపులర్ అయ్యాడు.ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా భారీ హిట్ ను అందుకున్నాయి. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విజయ్… ఇప్పుడిప్పుడే నెట్టింట సందడి చేస్తున్నారు.. సినిమాల కన్నా కూడా ఇలా ఫెమస్ అవుతున్నాడు.ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తోంది. అయితే తాజాగా విజయ్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ లో విజయ్ భాగం కానున్నారంటూ టాక్ వినిపిస్తోంది.కేజీఎఫ్ తో బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సలార్ రూపొందుతుంది. ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి. సలార్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై ఆసక్తి పెంచగా.. ఇటీవల విడుదలైన వర్కింగ్ స్టిల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి.ఇకపోతే ఈ సినిమా లో విజయ్ నటిస్తున్నారట. అది కూడా ప్రభాస్ తమ్ముడిగా విజయ్ కనిపించనున్నారని.. సలార్ క్లైమాక్స్ లో విజయ్ ను పరిచయం చేసి .. ఆ తర్వాత రానున్న సలార్ 2 చిత్రంలో కీలకమైన పాత్రలో ఆయన్ను చూపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. నిజంగా విజయ్ ఉంటే మాత్రం హిట్ పక్కా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి... ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: