టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక అదే సమయంలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు.గత ఏడాది బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' చిత్రంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నారు.ఇక  దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలావుంటే ఇక నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమా చేస్తున్నారు. ఇకపోతే పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది.బాలయ్య దీని తర్వాత టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితోనూ సినిమా చేయనున్నారు.ఇక  ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ 18 నుంచి జరగబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే ఇప్పటికే చేతిలో రెండు సినిమాలను పెట్టుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఇక  ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మరింత సమాచారం లీకైంది.  ఆయన పరశురాంతో సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది.ఇక  దీనిపై లేటెస్ట్ సమాచారం ప్రకారం.. తాజాగా ఈ డైరెక్టర్.. బాలయ్యకు స్క్రిప్టును వినిపించాడట.ఇక  ఇది ఆయనకు ఎంతో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తారని టాక్.కాగా 'సర్కారు వారి పాట' ఫలితంతో కాస్త నిరాశ పడిన పరశురాం.. నందమూరి బాలకృష్ణ కోసం పక్కా కమర్షియల్ స్టోరీని రెడీ చేశాడని తెలిసింది. ఇక ఈ సినిమాను ఇండియా రేంజ్‌లో రూపొందించేలా బడా ప్రొడ్యూపర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: