లైగర్ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొన్నటి వరకు ఛార్మీ, పూరీ జగన్నాథ్ ను విచారించిన ఈ డి హీరో విజయ్ దేవరకొండను కూడా అధికారులు బుధవారం విచారించారు. అయితే తాజాగా విచారణ పూర్తయింది . ఈ విచారణలో భాగంగా విజయ్ దేవరకొండ పారితోషికం విషయంపై కూడా ప్రశ్నించినట్లు సమాచారం. నిన్న ఉదయం ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్ ను అధికారులు దాదాపు 11 గంటల పాటు ప్రశ్నించారని తెలుస్తోంది. విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో కూడా మాట్లాడారు.


మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం ఆఫీసుకు వచ్చాం.. కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ అడిగారు.. మంచిగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు..వాళ్లకు కావలసిన సమాధానం నేను ఇచ్చాను.. మీరు ఇంతగా ప్రేమిస్తారు కాబట్టి ఆ ప్రేమతో వచ్చే ప్రాబ్లం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.. అందులో ఇది కూడా ఒకటి.. ఇది లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది.. అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు.. నన్ను విచారణకు పిలిచారు.. నా బాధ్యతగా వచ్చి సమాధానాలు చెప్పాను.  అంతేతప్ప ఇందులో అలిగేషన్స్ ఏమీ లేవు.. కేవలం క్లారిఫికేషన్ అంతే అంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు అయితే మళ్లీ అధికారులు విచారణకు  హాజరు కావాలని చెప్పలేదని కూడా విజయ్ తెలిపారు.


అయితే దాదాపు 11 గంటల పాటు సాగిన ఈ విచారణలో పలుకోణాలలో అధికారులు విజయ్ ను  ప్రశ్నించారని తెలుస్తోంది. సినిమా పెట్టుబడుల గురించి రెమ్యునరేషన్ గురించి సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.  అంతేకాదు ఈ నేపథ్యంలో విజయ్ బ్యాంకు స్టేట్మెంట్స్ ని కూడా ఈడి అధికారులు పరిశీలించినట్లు చెబుతున్నారు. పి ఎం ఎల్ ఏ సెక్షన్ 50 కింద విజయ్ దేవరకొండ స్టేట్మెంటును రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ తప్పిదం ఏమీ లేదు అని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: