ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ , ఆ తర్వాత ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి , ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇలా కామెడీ షో ల ద్వారా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే కొన్ని సినిమాల్లో హీరో గా కూడా నటించి ప్రేక్షకులను సుధీర్ అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుడిగాలి సుదీర్ "గాలోడు" అనే మూవీ లో హీరో గా నటించాడు. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో గ్నేహ సిప్పి , సుదీర్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ ని రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఇప్పటికే ఈ సినిమా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ దక్కించుకున్నట్లు , ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: