ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ తన 67వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కమలహాసన్ తో తెరకెక్కించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో లోకేష్ తన తదుపరి సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఈ క్రమంలోని వారసుడు సినిమా తర్వాత విజయ్ దళపతి తన తదుపరి చిత్రాన్ని #దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వారసుడు సినిమా సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి.

మరి ఈ సినిమా అనంతరం విజయ్ దళపతి తన 67వ చిత్రాన్ని లోకేష్ కనగరాజు దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విక్రమ్ కమలహాసన్ తో పాటు ఖైదీలను కూడా చేర్చుకోపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయాన్ని స్వయంగా లోకేష్ కనగరాజు ప్రస్తావించారు.. ఇకపోతే లోకేష్ సినిమా విక్రంలో కార్తీ నటించిన ఖైదీ సినిమా గురించి ప్రస్తావించగా.. సినిమా చివర్లో సూర్యను రోలెక్స్ గా పరిచయం చేయడం మనం చూసాం. కమలహాసన్ వర్సెస్ సూర్య కచ్చితంగా పోటీ పడబోతున్నట్లు స్పష్టమైనది.

ఈ క్రమంలోనే ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని.. కమలహాసన్ సూర్య జోడి కి విజయాన్ని చేర్చి ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచబోతున్నారు లోకేష్ కనకరాజు.. ముఖ్యంగా ఖైదీ సినిమా విక్రమ్ సినిమా రెండింటిలో కూడా భాగమైన నటుడు నరైన్ ని కూడా విజయ్ దళపతి 67వ చిత్రంలో భాగము అయ్యేలా చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే విజయ్ దళపతి 67 సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెంచేస్తున్నారు లోకేష్ .. ఓకే స్క్రీన్ పై కమలహాసన్,  సూర్య,  విజయ్ దళపతి కనిపించబోతున్నారు అని స్పష్టం చేశారు లోకేష్. మరి.. ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: