మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే పరభాష హీరోయిన్లకే డిమాండ్ ఎక్కువ. మన టాలీవుడ్ లో సగం హీరోయిన్లు వాళ్ళే అనిచెప్పాలి. ఈ క్రమంలోనే శాండల్ వుడ్ నుంచి వచ్చి.. ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా దయ వల్ల స్టార్ డమ్ పొందింది హీరోయిన్ రష్మిక మందన్న.తెలుగులో ఫస్ట్ మూవీ నుంచే ఆకట్టుకున్న రష్మికకు మొట్టమొదట ఛాన్స్ ఇచ్చిన పెద్ద స్టార్ హీరో మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మికకు ఛాన్స్ రావడం ఆ సినిమా బ్లాక్  బస్టర్ హిట్ కావడంతో రష్మిక దెబ్బకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఎప్పటికప్పుడు రెమ్యూనరేషన్ పెంచుతూ వస్తోన్న ఈ హాట్ బ్యూటీ.. తాజాగా తన రేటుని దెబ్బకు రౌండ్ ఫిగర్ చేసిందట.ప్రస్తుతం ఈమె టాలీవుడ్ తో పాటు సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మంచి డిమాండ్ సంపాదించుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించి ఈ హాట్ బ్యూటీ.. బాలీవుడ్ లో కూడా తన ప్రతాపంచూపించాలని ఎంతగానో హడావిడి చేస్తోంది.


అలాగే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర మాస్‌ ఫ్యాన్ బేస్ ను కూడా తీసుకువచ్చింది. ఇక ఈ క్రమంలో తన డిమాండ్  ఎక్కువగానే ఉంది అనుకుందో ఏమో.. రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసిందట ఈ హాట్ బ్యూటీ.మొన్నటి వరకూ కూడా మూడు కోట్లు.. నాలుగు కోట్లు.. మూడున్నర కోట్లూ అంటూ పారితోషికం తీసుకుంటూ వచ్చిన రష్మిక .. ఇప్పుడు ఏకంగా రౌండ్ ఫిగర్ చేసుకుని.. ఏకంగా ఐదు కోట్లు అడిగేస్తుందట. ఇప్పుడు సినిమాకు ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇచ్చుకోగలిగిన వారికి మాత్రమే సినిమాలు చేస్తానంటుందంట.అలాగే తాజాగా IDC ఫేస్ వాష్ బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం కొట్టేసింది రష్మిక. అయితే రష్మికని ట్రోల్ చేసేవారు కూడా ఎన్నో లక్షల మంది వున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసిన కానీ రష్మిక మాత్రం వరుస ఆఫర్లు అందుకుంటూ బాగా సంపాదించుకుంటూ తన కెరీర్ పరంగా చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: