తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ మొదటిసారి లాయర్ పాత్రలో నటించబోతున్న చిత్రం ముఖచిత్రం. ఇందులో వికాస్ వశిష్ట , ప్రియ వడ్లమాని, చైతన్యరావ్ , ఆయేషా ఖాన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కలర్ ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజు ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కే ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పథాకంపై ప్రదీప్ యాదవ్ మోహన్ నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు చిత్ర బృందం.

ఈనెల 9వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేయంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  అయితే ఈ చిత్ర ట్రైలర్ హైదరాబాదులో విడుదల చేశారు. ముక్కోణపు ప్రేమ కథ అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఎన్నెన్నో మలుపులతో ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.  ఒక అమ్మాయి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి మరో అమ్మాయిలా మారిస్తే ఏం జరుగుతుంది.. వాళ్ళ పాత్రలకు హీరోకి ఉన్న సంబంధం ఏంటి.. ఇలాంటి అంశాలతో చాలా క్యూరియాసిటీని కలిగిస్తోంది ట్రైలర్.

అలాగే వెర్సటైల్ డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు రవిశంకర్.. విశ్వక్ సేన్ ల మధ్య కోర్టు డ్రామా మరింత ఆసక్తిగా ఇంట్రెస్ట్ గా మారనుంది.  ఇకపోతే డిసెంబర్ 9వ తేదీన రాబోతున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు.  ఇప్పటికే ట్రైలర్ తో సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. ఎలాగో విశ్వక్ సేన్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటాడు అన్న ముద్ర కూడా పడింది. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ ట్రైలర్ చూసినవాళ్లు ముఖచిత్రం సినిమా కలర్ ఫోటో రేంజ్ లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: