పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ ఇండియా మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిది అగర్వాల్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం కీరవాణి ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికి చాలా కాలమే అవుతున్న మధ్యలో కొంత కాలం పాటు ఈ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ను చిత్ర బృందం పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కేథరిన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , కేథరిన్ పాత్ర ఈ మూవీ  క్లైమాక్స్ ముందు రాబోతున్నట్లు , అలాగే ఈ ముద్దు గుమ్మ పాత్ర ఈ మూవీ లో నెగటివ్ షేడ్స్ కలిగి ఉండబోతున్నట్లు , కేథరిన్ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కేథరిన్ ఇప్పటికే ఈ సంవత్సరం భళా తందనానా ,  మాచర్ల నియోజకవర్గం ,  బింబిసారా మూవీ లలో నటించింది. ఇందులో బిబిసారా మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా ప్రస్తుతం వరుస మూవీ అవకాశాలను దక్కించుకున్న కేథరిన్ "హరిహర వీరమల్లు" మూవీ లో కూడా అద్భుతమైన పాత్రను దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: