ఇప్పటివరకు మీడియం రేంజ్ సినిమాలకు దర్శకుడుగా పేరుగాంచిన మారుతి ప్రభాస్ తో సినిమా తీయడం డార్లింగ్ అభిమానులకు కూడ షాక్ ఇస్తోంది. ఇప్పటికే కొద్ది రోజుల పాటు జరిగిన ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ తరువాత ఈమూవీ సెకండ్ షెడ్యూల్ ను త్వరలో ప్రారంభం కాబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి.


ఇప్పటికే ఈసినిమాలో నటించే కీలక నటీనటుల ఎంపికతో పాటు ఈమూవీలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ ఎంపిక కూడ పూర్తి అయింది అంటున్నారు. ఇది ఇలా ఉండగా మారుతి వ్రాసుకున్న ఈమూవీ కథలో ఫ్యాంటసీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ కు 80 కోట్ల వరకు ఖర్చు అవుతుందని మారుతి ఇప్పటికే ఈమూవీ నిర్మాతలకు అంచనా వేసినట్లు తెలుస్తోంది.


వాస్తవానికి మారుతి ఇప్పటివరకు మీడియం రేంజ్ సినిమాలను తీసాడు కానీ భారీ బడ్జెట్ మూవీలను హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. దీనితో ఇంత భారీ ప్రాజెక్ట్ ను ఎంతవరకు మారుతి హ్యాండిల్ చేయగలడు అన్న సందేహాలు ప్రభాస్ అభిమానులలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీలో కీలకమైన ఒక విలన్ పాత్రకు సంజయ్ దత్ ఎంపిక అయ్యాడు అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలలో అతడి పక్కన ముగ్గురు హీరోయిన్స్ నటించిన సందర్భాలు లేవు.


అయితే మారుతి ఈ ఫ్యాంటసీ కథలో ప్రభాస్ కు ముగ్గురు హీరోయిన్స్ ను క్రియేట్ చేయడమే కాకుండా ఆ ఫ్యాంటసీ కథకు తన సహజ సిద్ధమైన హాస్యాన్ని కూడ జోడిస్తున్నాడు అని తెలుస్తోంది. దీనితో ఇప్పటి వరకు ప్రభాస్ నటించని కామెడీ యాంగిల్ ను ఈమూవీలో చూసే ఆస్కారం కనిపిస్తోంది. అయితే టాప్ హీరోల సినిమాల విషయంలో ఒక చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటు ఆమూవీ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. దీనితో మారుతి ప్రభాస్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి: