ఇప్పటికే ఈ సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమా లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలా ఈ సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక వ్యూస్ సాధించిన 10 సినిమాలు ఏవో తెలుసు కుందాం .

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప ది రైస్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ రెండవ స్థానంలో నిలిచింది. ప్రశాంత నీల్ దర్శకత్వం లో యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కే జీ ఎఫ్ చాప్టర్ 1 మూవీ మూడవ స్థానంలో నిలిచింది. హను రాఘవపూడి దర్శకత్వం లో దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం మూవీ 4 వ స్థానంలో నిలిచింది. మణిరత్నం దర్శకత్వం లో చయాన్ విక్రమ్ ,  కార్తి , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ వన్ మూవీ 5 వ స్థానంలో నిలిచింది. బచ్చన్ పాండే సినిమా 6 వ స్థానంలో నిలిచింది. జుగ్ జుగ్ జే మూవీ 7 వ స్థానంలో నిలిచింది. రన్ వే 34 మూవీ 8 వ స్థానంలో నిలిచింది. జురాసిక్ వరల్డ్ డో మినియన్ మూవీ 9 వ స్థానంలో నిలిచింది. గెహ్రైయాన్ మూవీ 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: