మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల మనుషులను దోచుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో కూడా అనసూయ తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో మూవీ లలో ఎన్నో పాత్రలలో నటించిన అనసూయ కు ... రంగస్థలం మూవీ లోని రంగమ్మత్త పాత్ర ద్వారా ... పుష్ప ది రైస్ మూవీ లోని దాక్షాయిని పాత్ర ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ రెండు మూవీ లలోని నటనతో అనసూయ ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఈ రెండు మూవీ లతో పాటు క్షణం మూవీ లోని ప్రతినాయక పాత్ర ద్వారా కూడా అనసూయ మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సినిమాల్లో తన అందచందాలను ఆరబోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన అందచందాలు ఆరబోసే విధంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్లూ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: